నా మొగుడు అమ్మాయే..!

1288

స్వలింగ సంపర్కం చట్ట సమ్మతమేనని సుప్రీంకోర్ట్ తీర్పుచెప్పీ చెప్పకముందే ఓ మోసపు పెళ్లి బైటపడింది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు బాలికలు సినిమా స్టైల్ లో కథలల్లి పెళ్లి చేసుకుని ఇప్పుడు తన భర్త కూడా అమ్మాయేనంటూ భార్య ప్రకటన చేయడం విశేషం. బీమ్ నగ్రిస్ నగరంలో ప్రీతి అనే యువతి సోనీ అనే స్నేహితురాలిని మగవాడని చెప్పి వేషం మార్పించి కార్తీక్ గా పేరు మార్చి కార్తీక్ తల్లిదండ్రులుగా అద్దెకు వచ్చే పెద్దల్ని పెట్టి సినిమా స్టైల్ లో పెళ్లి చేసుకుంది. ప్రీతి బీఎస్సీ స్టూడెంట్ కాగా, సోనీ అదే కాలేజీలో బీఏ చదువుతోంది. ఇద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. పెళ్లి చేసుకుని కలసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని ప్రీతి, సోనీని మగవేషంలో కార్తీక్ తన లవర్ అంటూ ఇంట్లో పరిచయం చేసి పెద్ద నాటకం ఆడి పెళ్లి చేసుకుంది. సుప్రీంకోర్ట్ తీర్పు బైటపడిన వెంటనే ఇద్దరూ తాము స్వలింగ సంపర్కులమని కుటుంబ సభ్యులకు భయపడి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నామని, ఇక తమది చట్టబద్ధమైన పెళ్లేనని చెప్పారు. పెద్దలకు ఇష్టం లేకపోతే విడిగా ఉంటామని కూడా తెగేసి చెప్పారు.