ప్రేమికుడిని సజీవదహనం చేసిన ప్రేయసి తండ్రి..

276

కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ ను నడిరోడ్లో కిరాతకంగా హత్య చేయించాడు మామ. ఇక్కడో మామ కూతుర్ని ఎక్కడ తీసుకెళ్లిపోతాడన్న అనుమానంతో ప్రేమికుడిని ఇంటికి పిలిపించి మరీ ఒంటికి నిప్పంటించారు. సజీవంగా తగలబెట్టాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎటా నగరంలోని అలీగంజ్‌లో జరిగింది. ట్రక్ డ్రైవర్ గా పనిచేసే నరేంద్ర సాక్యా(22) రష్మీ అనే ఓ యువతిని ప్రేమించాడు. ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఇటీవల రెండు రోజులుగా ఇద్దరూ ఎక్కడికో పారిపోయారు. చివరికి ఓ మాయోపాయంతో అమ్మాయి తండ్రి నరేంద్రను ఇంటికి పిలిపించాడు. పెళ్లి విషయం మాట్లాడదామని పిలిపించిన కుటుంబ సభ్యులు అతడ్ని ఓ గదిలోకి తీసుకెళ్లి, మంచానికి కట్టేసి తగులబెట్టారు. దీంతో ఆ యువకుడు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.