మహానాయకుడు ట్రైలర్ విశేషాలివి..

97

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రికార్డ్ సృష్టించింది. మామ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తే, ఎన్టీఆర్ కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు నేపథ్యంలో మహా నాయకుడు చిత్రం ట్రైలర్ రూపొందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబును దోషిగా చూపిస్తే, బాలకృష్ణ మహానాయకుడులో చంద్రబాబుని ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా హీరోగా చూపించారు. మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఇందిరాగాంధీ ఆయన్ను పదవినుంచి దించేందుకు నాదెండ్ల భాస్కర్ రావు సహకరించిన తీరు, నాదెండ్ల భాస్కర్ రావు ద్రోహం, వెన్నుపోటు, కుట్ర.. ఈ నేపథ్యంలోనే తీసినట్టుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, చైతన్య రథంలో ఎన్నికల ప్రచార యాత్ర, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత 2రూపాయలకు కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు చివరిగా నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు. ఆ కుట్రను చంద్రబాబు నాయుడు ఎదుర్కొని, మళ్లీ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసిన వ్యూహం. ఈ కథాంశాల నేపథ్యంలోనే మహానాయకుడు చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.