నేనొప్పుకోను..

253

జీఎస్టీ చెల్లించలేదంటూ తన బ్యాంకు ఖాతాలు సీజ్ చేసిన కమిషనర్ కి సినీ నటుడు మహేశ్ బాబు లీగల్ నోటీసులు పంపించారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాలను ఎందుకు సీజ్ చేశారని నోటీస్ లో ప్రశ్నించారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు, బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ అందించిన సేవల మొత్తంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని జీఎస్టీ విభాగం రెండు రోజుల క్రితం పేర్కొంది. 2007-08 ఏడాదికి మహేష్‌బాబు రూ.18.5 లక్షల సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదన్నది అధికారుల అభియోగం. పన్ను, జరిమానా, వడ్డీల రూపంలో మొత్తం రూ.73.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌కు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్టు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రకటనలో పేర్కొంది. మహేష్ బాబు ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించారని ఆయన ప్రతినిధులు ఇదివరకే స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన తరపున జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు.