రేపు నెల్లూరులో మెగా యూత్ క్రిస్మస్ వేడుకలు

141

రేపు నెల్లూరులో మెగా యూత్ క్రిస్మస్ వేడుకలు
నగరానికి రానున్న సీవైఎఫ్ డైరెక్టర్ రెవ.మూర్తిరాజు..
నెల్లూరులో మెగా యూత్ క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు(గురువారం) సాయంత్రం ఈ మెగా ఈవెంట్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఏపీ టూరిజం హాల్ లో నెల్లూరు క్రిస్టియన్ యూత్, సీవైఎఫ్(నెల్లూరు) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మెగా యూత్ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవ. బి.హెచ్.వి. మూర్తిరాజు గారు (Director,CYF International) ( Look to Jesus Tv speaker)తమ దైవ సందేశాన్ని అందించుటకు విచ్చేయుచున్నారు. రెవ. అభిలాష్ సన్ని గారు Ap state Chrisitan Youth President కార్యక్రమంలో పాల్గొనెదరు, ప్రత్యేక సువార్త గాయకులు రెవ. బోనాల హనోక్ గారు (Worship leader, Kurnool ), పాస్టర్ సుధాకర్ గారు (Worship leader, Kakinada) క్రిస్మస్ ప్రత్యేక గీతాలు ఆలపించెదరు. జాయ్ ఇన్ జీసస్ వర్షిప్ బ్యాండ్, సిరా ఫేమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీతం అందించబడును. రెమో. జి.ఆశిష్ (రాయలసీమ రీజినల్ మీడియా కోఆర్డినేటర్), రెవ. పాల్ సందీప్ (జిల్లా కమిటీ అడ్వైజర్), ఆపిల్ కిరణ్ (జిల్లా ప్రెసిడెంట్ ), సుజన్ రవీంద్ర బాబు (జిల్లా సెక్రెటరీ), శ్రీకాంత్ (సిటీ ప్రెసిడెంట్ ), స్వరూప్ (సిటీ సెక్రటరీ ), వినయ్ (జాయింట్ సెక్రటరీ ), స్టీఫెన్ రాజు (రూరల్ ప్రెసిడెంట్ ), తేజ (రూరల్ సెక్రటరీ )మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ సంగీతం, వాక్యపరిచయం, కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్, క్రిస్మస్ ట్రీ ఇనాగరేషన్ జరుగును.. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలియజేశారు.