ముందస్తుకి వెళ్లే అవసరం మాకేంటి..?

251

తెలంగాణలో లాగా ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఆ తప్పుడు కథనాల వెనక ఏ పార్టీ ఉందో అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికలకు ఇంకా 10 నెలలు గడువుందని, పూర్తి మెజారిటీతో ఉన్న టీడీపీకి ముందస్తుకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి.. రాష్టరంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.