ఎన్టీఆర్ బయోపిక్ పై మోహన్ బాబు రివ్యూ..

958

‘ఎన్టీఆర్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు అన్నయ్య మళ్లీ పుట్టినట్లు అనిపించిందని అంటున్నారు విలక్షణ నటుడు మోహన్‌బాబు. ఎన్టీఆర్‌ జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్: కథానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నటసార్వభౌముడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్‌ చేశారు మోహన్‌బాబు.
‘రామారావు.. నాకు అన్నయ్య. ‘ఏక గర్భమునందు జన్మించకపోయినా మనమిద్దరం అన్నదమ్ములం’ అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్‌ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ కుమారుడు బాలయ్య తన తండ్రి చేసిన పాత్రలను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు. అది కొంచెం కష్టతరమైన పని. బాలకృష్ణ ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమాను నిర్మించి, నటించాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్‌కు నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా..? అనిపించింది. బాలకృష్ణ కొన్ని యాంగిల్స్‌లో తన తండ్రిని పోలి ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.