మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలు..

80

విశాఖలో జరుగుతున్న మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో మహిళా బాడీ బిల్డర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆదివారం రాత్రి ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మహిళల విభాగంలో అంజనా సింగ్‌ (ఛత్తీస్‌గడ్‌), మంగళాసేన్‌ (పశ్చిమ బంగ), మిథాలీ నాయర్‌ (మహారాష్ట్ర), జ్యోతి విభార్‌ (ఛత్తీస్‌గడ్‌) పాల్గొని అభిమానులను అలరించారు. మహిళల బాడీబిల్డింగ్‌తో పాటు మిస్టర్‌ ఇండియా పోటీలు నగరంలో తొలిసారిగా జరగడంతో చూసేందుకు వచ్చిన అభిమానులతో గురజాడ కళాక్షేత్రం కిక్కిరిసింది. ఈ పోటీల్లో తలపడేందుకు దేశం నలుమూలల నుంచి 240 మంది బాడీబిల్డర్లు హాజరయ్యారు.