గుడిలోనే తిప్పి తిప్పి చూపించింది..

891

ఎక్కడ ఏది ఎలా చేయాలన్న ఇంగితం లేక ఒక ముంబై మోడల్ చిక్కుల్లో పడింది. ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో జరిగిన ఒక షూట్‌కి మోడల్ నందిని కురీల్ హాజరైంది. కెమెరా ముందు చేసిందేదో చేసి చక్కా వెళ్లిపోకుండా సోషల్ మీడియాలో జొరబడింది. తెల్ల చీర కట్టుకుని తాను గుడిలో తీయించుకున్న ఒక ‘అసభ్యకరమైన’ వీడియోను పోస్ట్ చేసింది. పైగా.. అఫ్రీన్ పాటకు తగినట్లు డాన్స్ కూడా ఆడింది. నీ గ్లామర్ ఎక్కడైనా ప్రదర్శించుకో ఇక్కడ కాదు అంటూ భక్త నెటిజనం ఆమె మీద విరుచుకుపడుతోంది.