పేకాటలో గొడవ

709

పేకాటలో గొడవ
క్షణికావేశంలో స్నేహితుడ్ని చంపిన దుర్మార్గుడు
స్నేహితులిద్దరూ పేకాడుతున్నారు. గెలిచిన వాడికి ఓడిన వాడు వెయ్యి రూపాయలు బాకీ పడ్డాడు. 800 తీసుకో మిగతా 200 తర్వాత ఇస్తానన్నాడు. అది కూడా ఇవ్వమని జేబులో చేయి పెట్టాడు గెలిచినవాడు. ఓడిపోయినవాడికి ఎక్కడో మండింది. నా జేబులోనే చేయి పెడతావా అంటూ రాయితో తలపై మోదాడు. ఆ దెబ్బకి విలవిల్లాడుతూ అతడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గుంటూరు నగరం ఏటీఅగ్రహారంలో జరిగింది. వెంకట రమణ అనే వ్యక్తిని మోహన్ దారుణంగా చంపేశాడు. విచారణలో వాస్తవాలు తేలడంతో పోలీసులు మోహన్ ని అదుపులోకి తీసుకున్నారు.