జ‌న‌మంతా ఒక‌వైపు.. ఆయ‌న ఒక్క‌డు ఒక‌వైపు..

76594
  • నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌కు సాక్ష్యం అత‌డు

  • మ‌నం న‌మ్ముకున్న‌దే చేయాల‌నే త‌ప‌న ఉన్న‌వాడు

  • అవ‌రోధాలు ఎదురైనా త‌న మార్గంలో న‌డుస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్న తెలుగువాడు

న‌ల్ల‌మోతు శ్రీధ‌ర్‌. తెలుగులో టెక్నాల‌జీ పాఠాలంటే ట‌క్కున గుర్తొచ్చే ఒకే ఒక మ‌నిషి. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే తెలుగువాళ్లు ఎవ‌రైనా ముందు శ్రీధ‌ర్ వీడియోలు చూస్తారు. తెలియ‌నివి నేర్చ‌కోవాలంటే ఆయ‌న ఛాన‌ల్ ఫాలో అవ‌డంకంటే ఉత్త‌మ‌మైన మార్గం ఇంకోటి లేదని న‌మ్ముతారు. కేవ‌లం టెక్నాల‌జీ విష‌యంలోనే కాదు.. నైతిక విలువ‌ల‌ను పంచ‌డంలోనూ శ్రీధ‌ర్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఎన్నోసార్లు.. అంత‌ర్జాతీయ ఛానెళ్లకంటే ముందు టెక్నాల‌జీ గురించిన కీల‌క స‌మాచారాన్ని బ‌య‌ట పెట్టారు శ్రీధ‌ర్‌. గ‌తంలో జ‌రిగిన స్కాములు, వాటిపై విశ్లేష‌ణ‌ల‌ను చేస్తూ జ‌నంలో చైతన్యం తీసుకురావ‌డానికి కృషిచేస్తున్నారు. ఇందులో పెద్ద విశేష‌మేముంది అనే వాళ్లూ ఉన్నారు. నెల‌కు జీతం తీసుకుని ఎవ‌రైనా ఈ ప‌నిచేస్తారు. కానీ.. శ్రీధ‌ర్ అలా కాదు.. కేవ‌లం టెక్నాల‌జీపై ఉన్న మ‌క్కువ‌తో.. జ‌నంలో చైత‌న్యం తీసుకురావాల‌నే కోరిక‌తోనే న‌యాపైసా ఆశించ‌కుండా ఆయ‌న చేస్తున్న సేవ ఇది!

తాజాగా దేశంలో తెగ హ‌డావుడి చేసిన చీప్ స్మార్ట్‌ఫోన్ విష‌యంలోనూ శ్రీధ‌ర్ అలుపెరుగ‌ని పోరాటం చేశారు. ఇంకా చేస్తున్నారు. అస‌లు అంత త‌క్కువ‌కు స్మార్ట్‌ఫోన్ ఎలా వ‌స్తుంది? అని కేవ‌లం క్వ‌శ్చ‌న్ వేసి ఊరుకోకుండా.. అది ఎలా సాధ్య‌మ‌వ‌దో లెక్క‌ల‌తో స‌హా నిరూపించేశారు. ఒకే ఒక్క‌రోజులో అదంతా అయ్యే అవకాశాలున్నాయని అని తేల్చిప‌డేశారు. సాక్షాత్తూ మెయిన్‌స్ట్రీమ్ మీడియానే ఈ చీప్ స్మార్ట్‌ఫోన్‌కు మ‌ద్ద‌తుగా స్టోరీలు ప్ర‌సారం చేస్తుంటే.. ఆయ‌న మాత్రం త‌న పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు. జ‌నంలో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. అందులో స‌క్సెస్ కూడా అయ్యారు.

మేగజైన్, TV Programs, టెక్ వీడియోల ద్వారా టెక్నాలజీ సామాన్యులకు 20 ఏళ్లుగా అందిస్తున్నారు శ్రీధ‌ర్‌. అంద‌రూ చ‌దువుతారు. అంద‌రూ రాస్తారు. కానీ.. గుడ్డిగా అన్నీ న‌మ్మే జ‌నాల్లో అవ‌గాహ‌న తీసుకురావ‌డ‌మంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.. చీద‌రింపులు.. చీత్కారాలు.. మీకే తెలుసా అని డైర‌క్ట్‌గా సెటైర్లు వేసే జ‌నాలు.. ఇలాంటి వాళ్లు వంద‌ల‌మందిని త‌న ఫాలోయర్లుగా చేసుకున్న ఘ‌న‌త కూడా మ‌న తెలుగువాడైన శ్రీధ‌ర్‌దే! మొత్తంగా రూ.251 రూపాయ‌ల స్మార్ట్ ఫోన్ విష‌యంలో ఆయ‌న స‌క్సెస్ సాధించారు.

గ‌తంలో కూడా ఎన్నో స్కామ్‌ల‌పై త‌న‌దైన శైలిలో.. లిమిటెడ్‌గా త‌న‌కున్నవ్య‌వ‌స్ధ‌ల‌ను వినియోగించి శ్రీధ‌ర్‌.. జనంలో అవ‌గాహ‌న తీసుకువ‌చ్చారు. తెలుగు వాళ్ల‌కు వ‌న్ అండ్ ఓన్లీ టెక్ గురూగా నిలిచారు. NDNకు టెక్నిక‌ల్ కంటెంట్ ఎడిట‌ర్‌గా ఉన్న శ్రీధ‌ర్ మ‌రెంతోమందికి టెక్ విష‌యాల‌ను చేర‌వేయాల‌ని, త‌న య‌జ్ఞాన్ని విజ‌య‌వంతంగా న‌డిపించాల‌ని NDN కోరుతోంది.

న‌ల్ల‌మోతు శ్రీధ‌ర్ ఫేస్‌బుక్ పేజ్ – https://www.facebook.com/nallamothusridhar
న‌ల్ల‌మోతు శ్రీధ‌ర్ యూట్యూబ్ ఛాన‌ల్ – https://www.youtube.com/user/nallamothu