రూరల్ నుంచి అజీజ్ పోటీ చేస్తారు – కార్పొరేటర్ రాజా నాయుడు ప్రకటన

86

నెల్లూరు రూరల్ నియోజకవర్గం బుజబుజ నెల్లూరులో కార్పొరేటర్ రాజా నాయుడు చేసిన ఓ ప్రకటన కాసేపు కలకలం రేపింది. సబ్ ప్లాన్ నిధుల పనుల పరిశీలన నిమిత్తం అక్కడకు వచ్చిన మేయర్ అజీజ్ రానున్న ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేస్తారని రాజా నాయుడు ప్రకటించారు. అయితే రాజా నాయుడు చేసిన ప్రకటనపై అజీజ్ స్పందించలేదు. రాజా నాయుడు సమావేశంలో ఈ ప్రకటన చేసినా, అజీజ్ ఆ ప్రకటనను ఖండించడంకానీ, సమర్థించడం కానీ చేయలేదు. యథాలాపంగా కార్పొరేషన్ తరపున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏకరువు పెట్టారు.