డిసెంబర్ 13న నెల్లూరులో నెల్లూరు మెగా యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

205

నెల్లూరు క్రిస్టియన్ యూత్, సీవైఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 13న నెల్లూరులో మెగా యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. నగరంలోని ఏపీ టూరిజం హోటల్ లో సాయంత్రం 6గంటలకు ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన పోస్టర్ ను బిషప్ మోజెస్ డి. ప్రకాశం ఆవిష్కరించారు. సువార్త స్రవంతి ఛానెల్ చైర్మన్ బర్నబాస్, రెవ బి. డేవిడ్ దయాసాగర్, డాక్టర్ సి.హెచ్.ఉషా కిరణ్ కార్యక్రమ వివరాలు తెలియజేసే పాంప్లెట్ ను ఆవిష్కరించారు.
మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు ముఖ్య ప్రసంగీకులుగా రెవ బి.హెచ్.వి.మూర్తి రాజు(CYF డైరెక్టర్ ,కాకినాడ) ,శ్రీమతి ఉష రాణి , రెవ మోజెస్ కిరణ్(నేషనల్ కోఆర్డినేటర్, సీవైఎఫ్), రెవ అభిలాష్ సన్నీ(ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సీవైఎఫ్) ప్రత్యేక సువార్త గాయకులు రెవ బోనాల హనోక్(వర్షిప్ లీడర్, కర్నూలు), పాస్టర్ సుధాకర్ (వర్షిప్ లీడర్, కాకినాడ) హాజరవుతారు.
జాయ్ ఇన్ జీసస్(వర్షిప్ బ్యాండ్ నెల్లూరు), సిరాఫేమ్స్ (కాకినాడ) సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి కార్య నిర్వాహకులుగా రెమో జి.ఆశిష్(రాయలసీమ మీడియా కోఆర్డినేటర్), రెవ.పాల్ సందీప్ (నెల్లూరు సీవైఎఫ్ అడ్వైసర్ ) యాపిల్ కిరణ్ ( సీవైఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు), రాజేష్ (సీవైఎఫ్ నెల్లూరు జిల్లా సెక్రటరీ), శ్రీకాంత్ (సీవైఎఫ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్), స్వరూప్ (సీవైఎఫ్ నెల్లూరు సిటీ సెక్రటరీ)  వినయ్ (జాయింట్ సెక్రెటరీ) వ్యవహరిస్తారు.
46abd34c-d3f5-4666-8be6-497a87e230bb