నెల్లూరుని నాశనం చేస్తున్నారు..

124

పేదవాళ్లు ఐదడుగులు స్థలం అడిగితే ఇవ్వని అధికారులు.. ఇరిగేషన్ కాల్వను దాదాపు 80శాతం పూడ్చేస్తే చూస్తూ ఊరుకున్నారెందుకని మండిపడ్డారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మన్సూర్ నగర్ కాల్వని ఆయన పరిశీలించారు. పూడిక తీసే పేరుతో కాల్వని దాదాపు పూడ్చేశారని, కనీసం ఇరిగేషన్ శాఖకు కూడా సమాచారం ఇవ్వలేదని, వర్షం వస్తే పరిస్థితి ఏంటని అన్నారు. ఇది మంత్రిగారి రాజ్యమా అని ప్రశ్నించారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకుని కాల్వను పూడ్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికోసం తెచ్చిన యంత్రాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.