అన్నదాత ఆగ్రహం.. ndn news

76

కనిగిరి చెరువు తూర్పు కాలువ చివరి ఆయకట్టు రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. తమకు సాగునీరు విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు ఒక్కసారిగా కలెక్టరేట్ కు చేరుకుని నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని రైతుల్ని శాంతింపజేశారు.