మాకు ఇల్లు కట్టించి మీరు రోడ్లు వేసుకోండి..

157

మాకు ఇల్లు కట్టించి మీరు రోడ్లు వేసుకోండి..
నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ల కోసం వేస్తున్న రోడ్లతో వందలాదిమంది ఇళ్లు వదిలిపెట్టి పోవల్సిన పరిస్థితి. లేదా ఉన్న ఇల్లు కూలదోసి కొత్త ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి. తవ్వేస్తున్న రోడ్లని పూర్తిగా తీయకుండా ఆ రోడ్లమీద మరో రెండడుగుల రోడ్డు వేసి ఇంటి లెవల్ కి పైన రోడ్డు ఉండేట్లు చూస్తున్నారు. దీనివల్ల వర్షపు నీరంతా ఇంటిలోకి పోతుంది. ఇంట్లోనుంచి రోడ్డులోకి రావాలన్నా, రెండు మూడు మెట్లు కట్టుకుని పైకి రావాల్సిన పరిస్థితి. ఇలా రోడ్లు నిర్మించడం వల్ల తమ ఇల్లు నిరుపయోగంగా మారిపోతున్నాయని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఏ మూల చూసినా, సందుగొందుల్లో ఇదే పరిస్థితి. సామాన్యుడు మొరపెట్టుకుంటే వినేవారే లేరు. కాంట్రాక్టర్ బిల్లుల యావ తప్ప అధికారులు కూడా వారి పలుకుబడికి భయపడి ఏమీ చెప్పలేక పోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం అయింది. అడ్డదిడ్డంగా అవినీతికరంగా పనిచేసి ఇలా కొంపలు ముంచేస్తున్నారు.