నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మృతి

145

నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఓ చిన్నారి నిండుప్రాణం బలైంది. నిన్న రాత్రి జరిగిన ఓ ఆపరేషన్ లో చిన్నారి మృతి చెందింది. నగరంలోని కొత్తూరుకు చెందిన రవి తన భార్య సోనుని కాన్పుకోసం సోమవారం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. సాధారణ కాన్పు అవుతుంది అని చెప్పారు వైద్యులు. రాత్రి బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి హడావిడిగా సోనుకు ఆపరేషన్ చేశారు. కాసేపటి తర్వాత బిడ్డ మృతి చెందిందని, ఓ గుడ్డలో చుట్టి తండ్రి చేతికి ఇచ్చారు. ఇంటికెళ్లి చూడగా బిడ్డ తల నుంచి రక్తం కారడాన్ని గమనించారు. ఇవాళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు అస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, వైద్యులని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఆసుపత్రి సూపరిండెంట్ ను అడ్డుకున్నారు. గతంలో కూడా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అయినా వైద్యుల తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి.