ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి..

137

ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి పోకుండా వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ వీధుల్లో తిరుగుతున్నారని, ప్రభుత్వానికి మాత్రం సహకరించడంలేదని అన్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. మెడికల్ క్యాంప్ లు పెట్టి కళ్లు బాగున్నాయా, గుండెం బాగుందా, కిడ్నీ బాగుందా అని అడగటం, చెత్త ట్రాక్టర్లు పెట్టి అక్కడక్కడా చెత్త తీసేయడం.. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు చేస్తున్నారని సెటైర్ వేశారు.