నెల్లూరు పోలీస్ స్టేషన్ ముందు మెప్మా మహిళల ఆందోళన..

71

నెల్లూరు పోలీస్ స్టేషన్ ముందు మెప్మా మహిళల ఆందోళన..
పసుపు-కుంకుమల కింద మహిళలకు ఇచ్చే చెక్కుల విషయంలో రాజకీయ జోక్యాలే కాదు… బెదిరింపులు ఎక్కువయ్యాయి. చెక్కుల పంపిణీ చేసే బాధ్యతను చేపడుతున్న మెప్మా మహిళా ఆర్గనైజర్లపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి. రెండో పట్టణ పరిధిలో వుండే కొంతమంది టీడీపీ నాయకులు తమను దుర్భాషలాడారని మెప్మా మహిళా ఆర్గనైజర్లు ఆందోళనకు దిగారు. అర్హులు కానివారికి చెక్కులు పంపిణీ చేయాలని తమపై ఒత్తిడి తెచ్చారని, ససేమిరా అన్నందుకు తమపై దాడికి యత్రించారని తెలిపారు. ఈ మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన మహిళల గోడును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. కేసు నమోదు చేయకుండా పోలీసులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని మెప్మా మహిళా ఆర్గనైజర్లు ఆరోపించారు.