పోలీస్ తనిఖీల్లోల 6.33కోట్లు సీజ్..

121

రూపాయి, రెండు రూపాయలు.. కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయల అక్ర‌మ న‌గ‌దును ప‌ట్టుకున్నారు త‌డ పోలీసులు. సాధార‌ణ తనిఖీల్లో భాగంగా త‌డ చెక్‌పోస్ట్ కి స‌మీపంలో వాహ‌నాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్ప‌దంగా వెళ్తున్న ఓ కారును ప‌రిశీలించిన పోలీసులు నిర్ఘాంత‌పోయారు. ఏకంగా 6కోట్ల 33 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దును గుర్తించారు. న‌గ‌దు త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. న‌రసాపురం నుంచి చెన్నైకు జూవెల‌ర్స్ కోసం న‌గ‌దు త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. దీంతో న‌గ‌దును నెల్లూరుకు త‌ర‌లించారు. ఎస్పీ ఐశ్వ‌ర్య ర‌స్తోగీ వివ‌రాల‌ను మీడియాకు వెళ్ల‌డించారు.