నెల్లూరోడు.. రికార్డ్ ల వీరుడు

104

కనుబొమ్మల కదలికలో వివిధ ప్రపంచ రికార్డులు సాధించిన ఐకా నాగేశ్వరరావుకి న్యూజిలాండ్ కి చెందిన గోల్డెన్ స్టార్ సంస్థ మరో పురస్కారాన్ని అందించింది. నెల్లూరు టౌన్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, సైట్ బుక్ ఆఫ్ రికార్డ్ లను అందుకున్న నాగేశ్వరరావుని ఆంధ్రా ఆర్ట్ అకాడమి అవార్డ్ కూడా వరించింది. కనుబొమల కదలికలో అరుదైన రికార్డులు సాధించిన చేనేత కళాకారుడు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాకు గర్వకారణం అని చేనేత ఐక్యవేదిక సభ్యులు అభినందించారు. న్యూజిలాండ్ గోల్డెన్ స్టార్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో జరిగింది.