నెల్లూరు రోడ్లపై భయం భయం..

85

నరకం అంటే ఎక్కడో ఉండదు.. నెల్లూరు రోడ్లలోనే ఉంది.. వర్షాలొస్తే ఇక చెప్పనలవికాదు.. కాలినడకే కష్టమైన పరిస్థితుల్లో వాహన చోదకుల బాధలకు అంతే లేదు.. ఏ వాహనం ఎక్కడ దిగబడుతుందో తెలియని అయోమయం, భయం. నెల్లూరులో రోడ్లమీద ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే. పాలకులు మాత్రం నెల్లూరు స్మార్ట్ సిటీ అంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారు. ముత్యాలపాలెంలో మున్సిపల్ చెత్త బండి గుంతలో దిగబడడంతో దాన్ని పైకి తీసుకొచ్చే పాట్లు చూడండి..