నెల్లూరు వాసుల సహనానికి పరీక్ష..

215

నెల్లూరులో చిన్నపాటి వర్షాలకే రోడ్లు మడుగులను తలపిస్తున్నాయి. నడవడానికి, వాహనాలు వెళ్లడానికి ఏమాత్రం వీలు లేకుండా గుంతలు తేలాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరవింద్ నగర్ ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అధికారులు. జేసీబీతో మట్టిని తరలించి గుంతలు పూడుస్తున్నారు. కంటి తుడుపు చర్యలు చేపట్టినా జనాలకి అవస్థలు మాత్రం తప్పలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేయడంతో చిన్నపాటి వర్షానికే నెల్లూరుకు ఇలాంటి దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి.