రూరల్ మెడికల్ క్యాంప్..

67

సామాన్యులకు వైద్య సౌకర్యాలు దూరమైన నేటి పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో 50 ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లకు శ్రీకారం చుట్టామని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సౌత్ మోపూరు గ్రామంలో జరిగిన మెడికల్ క్యాంప్ ని ఆయన పరిశీలించారు. క్యాంప్ కి హాజరైన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి కేవలం రాజకీయాలే కాకుండా సామాజిక సేవకు కూడా కృషి చేస్తున్నానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.