తండ్రి గెలుపు కోసం త‌న‌య ప్ర‌చారం…

119

11 ఏళ్ళలో త‌న తండ్రి క‌న్న ఎమ్మెల్యే క‌ల‌, 30 త‌ర్వాత తీరింద‌ని… అదంతా మీ ఆశీర్వాద‌మే అని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి చిన్న‌కుమార్తె వైష్ణ‌వి అన్నారు. క‌ల్లూరుప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీలో జ‌రిగిన ఆత్మీయ స‌మావేశంలో తండ్రితో క‌లిసి ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జాసేవ‌లో త‌రించాల‌న్న క‌ల నెర‌వేరిన క్ష‌ణం నుంచి నిరంత‌రం వారి సంక్షేమం కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జాక్షేమం కోరే త‌న తండ్రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాల‌ని కోరారు.