కిడ్నీ బాధితుడికి అండగా నిలబడిన రూరల్ ఎమ్మెల్యే

80

రెండు కిడ్నీలు చెడిపోయాయి. బాధితుడికి తల్లి, భార్య కిడ్నీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయినా ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్ధిక స్థోమత లేదు. ఉన్న రొక్కం అంతా అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. దిక్కుతోచని స్థితిలో బాధిత కుటుంబం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద తమ సమస్యను చెప్పుకుని వాపోయారు. చలించిపోయిన ఆయన ఎమ్మెల్యే… మీడియా సమావేశం ఏర్పాటుచేసి బాధితుడి వివరాలు వెల్లడించారు. పల్లపు సుధాకర్ అనే 22 యువకుడి రెండు కిడ్నీలు చెడిపోయాయని, తల్లీ భార్య కిడ్నీలు దానం చేసేందుకు ముందుకు వచ్చినా ఆపరేషన్ చేయించుకోలేని దుస్థితిలో వున్నారనన్నారు. ప్రభుత్వం ఇచ్చే నాలుగు లక్షలు కాకుండా, మరో నాలుగు లక్షలు ఆపరేషన్ ఖర్చులకు అవసరమవుతాయన్నారు. ఈ నేపధ్యంలో మనమంతా వారికి అండగా నిలవాలని కోరారు. హంగు, ఆర్భాటాలు లేకుండా కొత్త సంవత్సరం జరుపుకోవాలని, ఇలాంటి బాధితులకు చేయూత అందిస్తే, జన్మంతా ఒక మంచి పని చేశామనే తృప్తి వుంటుందన్నారు. తన వంతుగా 50వేల నగదు అందిస్తున్నట్లు ప్రకటించారు. దాతలంతా ముందుకు వచ్చి జనవరి 1వ తేదీ వైసీపీ రూరల్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఆర్ధిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.