మంత్రి నారాయణ హామీలు ఏమయ్యాయి..?

99

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి దుస్థితిని జడ్పీ సమావేశంలో మంత్రులు, అధికారుల ముందు ప్రస్తావించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పటికే పలుమార్లు మంత్రి నారాయణ ఆస్పత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆయన హామీలు ఆచరణ సాధ్యం కాలేదని చెప్పారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకునేవారే లేరని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణి మృతి చెంది నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు దర్యాప్తు నివేదిక ఎందుకు బైటపెట్టలేదని, బాధిత కుటుంబానికి పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.