కావలిలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి..

111

కావలి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో కావిలి డివిజన్ పోలీసులతో సమీక్ష నిర్వహించారు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో కావడంతో గ్రామాల్లోకి వెళ్లి సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. కాని స్టేబుల్ స్థాయినుంచి ఏఎస్సై వరకు అందరూ తమ పరిధిలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకుని వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. సిబ్బంది కొరత, వాహనాల కొరత ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని ఇబ్బందులను అధిగమించి విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కావలి డీఎస్పీ రఘు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.