రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్..

78

పోలీసులు ద్విచక్రవాహనాలపై వెళ్ళే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హుకుం జారీ చేశారు. పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రజలకు ఏం జవాబు చెప్తారని ప్రశ్నించారు. హెల్మెట్ ధరించి ప్రజలకు, వాహనచోదకులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. ప్రమాద మృతుల్లో అధికశాతం ద్విచక్రవాహన చోదకులే ఉన్నారని గుర్తు చేశారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధారణ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఈ నిబంధన సొంతశాఖ నుంచే ప్రారంభం కావాలన్నారు. సిబ్బంది హెల్మెంట్ ధరించకపోతే ఆరోజు విధులకు గైర్హాజరు వేయాలని ఆదేశించారు. దీనిపై తనకు ప్రతిరోజు నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు.