వీఆర్ కాలేజీ పాలకవర్గం ఎన్నికలకు నామినేషన్ల..

108

వీఆర్ కాలేజీ పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కలెక్టరేట్ లో జరిగింది. జాయింట్ కలెక్టర్ వెట్రి సెల్వి అభ్యర్ధుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. మద్యాహ్నం వరకు 106 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడానికి రావడంతో కలెక్టరేట్ లో కోలాహలం నెలకొంది. ఓటర్ల నమోదులో కమిటీ ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలున్నాయని దాఖలైన కేసుపై విచారణ అనంతరం వీఆర్ కళాశాల పాలకవర్గం ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరపకూడదు కానీ, ఎన్నికల ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు జేసీ. 20వతేదీ హైకోర్ట్ లో కౌంటర్ ఫైల్ దాఖలు చేసి కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరుపుతామని తెలియజేశారు.