ఇదెక్కడి న్యాయం..?

1361

విజయవాడలోని కనకదుర్గమ్మ సారె చీరను దొంగలించిన పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతను ట్రస్ట్ బోర్డ్ సభ్యత్వం నుంచి తొలగించారు. అయితే ఆమె అధికార పార్టీ నాయకురాలు కావడంతో ఆమెపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదే విచిత్రం. సాధారణంగా చిన్న వస్తువు దొంగతనం చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసే పద్ధతిని ఎందుకో పక్కనపెట్టేశారు. సారె చీరను దొంగిలిస్తూ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయిన సూర్యలతకు ఇక సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఆమె దొంగ అనే విషయం స్పష్టమైపోయింది. సూర్యలత విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తోంది. ఆమెపై పోలీస్ కేసు నమోదు చేయకుడా కేవలం ట్రస్ట్ బోర్డ్ సభ్యత్వం నుంచి మాత్రమే తొలగించి దేవస్థానం అధికారులు చేతులు దులుపుకున్నారు. సారె చీర పోయిన రోజు, చీర తాను తీసుకోలేదని దబాయించిన సూర్యలత.. ఆ తర్వాత సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయిన అనంతరం తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. ఆమె చీర తీసుకోవడం, దాన్ని క్యారీ బ్యాగ్ లో పెట్టుకోవడం అంతా స్పష్టంగా ఉంది. ఈ సీసీ టీవీ కెమెరా దృశ్యాలను కూడా దేవస్థానం అధికారులు విడుదల చేయలేదు.