పింఛన్ 2వేలు..

109

సామాజిక పింఛన్లను వెయ్యి రూపాయలనుంచి 2వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. బోగోలులో జరుగుతున్న ఆరో విడత జన్మభూమి ముగింపు సభలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి ఈ పెంపుదల అమలులోకి వస్తుందని తెలిపారు. సంక్రాంతికి అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం మూడు వేల రూపాయలు ఫిబ్రవరిలో లబ్దిదారులకు అందజేస్తామన్నారు.