కథానాయకుడి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

190

నూతన సంవత్సరం సందర్భంగా ‘యన్‌టిఆర్‌’ తన కుటుంబంతో విచ్చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగానే కాదు ఇందులో బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్‌ పుట్టినరోజు కూడా కావడంతో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌లో ఎన్టీఆర్‌(బాలకృష్ణ‌)..తన సతీమణి బసవతారకం(విద్యాబాలన్‌)తో కలిసి మనవడికి నామకరణం చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ పోస్టర్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.