నెల్లూరుకి నిధుల వరద, సింహపురికి మహర్దశ..

85

నెల్లూరుకు నెక్లెస్ రోడ్ తలమానికంగా మారుతుందని అన్నారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. నెక్లెస్ రోడ్డుని ఆపే ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవుపలికారు. సలహాలిస్తే స్వీకరిస్తామని, మరింత మెరుగ్గా నగరాన్ని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. స్వర్ణాల చెరువు చుట్టూ ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. నెల్లూరుకు నిధుల వరద వస్తోందని, నగరానికి మహర్దశ పడుతోందని చెప్పారు.