కాళ్లు చేతులు విరగ్గొట్టడం మాకూ తెలుసు..

78

కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి జరిగితే టీడీపీ ప్రభుత్వం, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని కచ్చితంగా నిలదీస్తారని అన్నారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. ప్రశ్నిస్తే కాళ్లూ చేతులు విరగ్గొట్టండి అంటూ కొంతమంది ప్రజల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. కాళ్లూ చేతులు విరగ్గొట్టడం మాకూ వచ్చు అయినా మేం అలాంటి పనులు చేయం, గాంధేయమార్గం మాది అని చెప్పారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్‌ మండలం 12వ డివిజన్‌ ధనలక్ష్మీపురంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, విజయ డైరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి తో కలసి ఆయన పర్యటించారు.