డాక్టర్ ని సస్పెండ్ చేయాల్సిందే..

98

వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళన చోటుచేసుకుంది. ఎంపేడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఏఎన్ఎం జ్యోతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయించేందుకు ఎంపేడుకు చెందిన మహిళలతో కలసి వెంకటగిరికి వచ్చింది. అయితే ఆస్పత్రి ఇంచార్జి శ్రీనివాసరావు ఈరోజు ఆపరేషన్లు చేయలేమని వారితో చెప్పారు. ఎందుకు ఆపరేషన్ చేయరని ఏఎన్ఎం ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. తనపై ఇంచార్జి శ్రీనివాసరావు చేసుకున్నాడంటూ ఏఎన్ఎం జ్యోతి ఆరోపిస్తోంది. పేషెంట్ల తరపు బంధువులు ఆందోళనకు దిగడంతో గొడవ పెద్దదైంది. డాక్టర్ ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమించబోమని ఏఎన్ఎం సహా పేషెంట్ల బంధువులు ధర్నాకు దిగారు.