పెళ్లికి పెట్రోల్ కానుక..

471

పెళ్లికి వచ్చిన అతిథులు సహజంగా నగలో, నగదో చదివించుకుంటారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతులుగా ఇస్తుంటారు. ఇప్పుడు పెట్రోల్ కూడా ఊహిచంని విధంగా రేటు పెరిగి విలువైన వస్తువుల జాబితాలో చేరడంతో.. పెళ్లికొడుకు స్నేహితులు కొంతమంది ఓ చమత్కారం చేశారు. వధూవరులిద్దరికీ 5లీటర్ల పెట్రోల్ క్యాన్ ను బహూకరించి ఫొటోలకి ఫోజులిచ్చారు. ఈ పెట్రోలు క్యాన్‌ చూసి పెళ్లిపందిట్లో ఉన్న వారంతా షాకయ్యారు. ఆ తర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కడలూర్‌లో జరిగింది.