ప్రసన్న చెప్పిన పోలీసు కుల కథ..

77

రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ లో కొందరు చంద్రబాబుకి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని తాట తీస్తామని హెచ్చరించారు. పోలీసులూ.. టీడీపీ కండువాలు కప్పుకోండని సలహా ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కూడా కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి ఉన్న కులపిచ్చి ఎవరికీ లేదని, అందుకే పోలీస్ శాఖలో తన వర్గానికి చెందిన వారికీ కీలక పదవులిచ్చారన్నారు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ కొడవలూరు మండలం కమ్మపాలెం రాష్ట్ర రైతు కార్యదర్శికి ఫోన్ చేసి ప్రసన్నతో ఎందుకు తిరుగుతున్నావని బెదిరించారన్నారు. ఇలా బెదిరించేవారందరికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు.