నగలకోసం గర్భిణి దారుణ హత్య..

318

కొత్త పెళ్లికూతురు కొత్తగా చేయించుకున్న నగలు, బట్టలు ఉత్సాహంతో బంధువులకు చూపించి తన చావుని తానే కొనితెచ్చుకుంది. మాలా అనే యువతికి ఆరు నెలల క్రితం పెళ్లయింది. ఆరు నెల గర్భంతో ఉన్న మాలా నగలు, కొత్త బట్టలు.. ఇంటికొచ్చిన బంధువులకు చూపించుకుంది. అదే సమయంలో పక్కింట్లో అద్దెకు దిగిన రీతూ అనే యువతి కూడా నగలు, బట్టలు చూసి వాటిని కాజేయాలని పన్నాగం పన్నింది. భర్తతో కలసి మాలాను హత్య చేసి నగలు, నగదు, కొట్టేశారు. మాలా భర్త ఆఫీస్ కి వెళ్లిన తర్వాత రీతూ, ఆమె భర్త దివాకర్ వారి ఇంటికి వెళ్లారు. మాలాతో మాటలు కలిపిన రీతూ, దివాకర్‌లు ఆమె గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేశారు. మాలా మరణించిందని ధ్రువీకరించుకున్న తర్వాత.. ఆమె ఫ్లాట్‌కు వెళ్లి నగలు, బట్టలు ఉన్న సూట్‌కేసు తీసి.. వాటి స్థానంలో మాలా శవాన్ని కుక్కారు. నగలు, బట్టలు తీసుకున్న అనంతరం రీతూ తన మేనమామ ఇంటికి వెళ్లగా.. దివాకర్‌ ఊరి శివారులో మాలా శవాన్ని పడేసి భార్య దగ్గరకు వెళ్లాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బైటపడింది. మొదట రీతూ భర్తని, అత్త మామల్ని అనుమానించినా తర్వాత పక్కింటి వారిని విచారించడంతో నిజం బైటపడింది. ఈ ఘటన ఘజియాబాద్ లో జరిగింది.