కావలి చేరిన ప్రియాంక మృతదేహం

2820

కావలి, అక్టోబర్-5: అమెరికాలో మృతిచెందిన తెలుగమ్మాయి గోగినేని ప్రియాంక చౌదరి మృతదేహం స్వగ్రామం కావలికి చేరింది. గత నెల 27న అమెరికాలో ప్రమాదవశాత్తు ఓ కొలనులో పడి ప్రియాంక మృతిచెందింది. డెడ్ బాడీ సోమవారం రావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రెండురోజుల ఆలస్యంగా కావలికి చేరింది. ప్రియాంక వయసు 25 సంవత్సరాలు. ఉన్నత చదువులకోసం 2014లో అమెరికా వెళ్లిన ఆమె ఇటీవలే చదువు పూర్తి చేసుకుని లాస్ వెగాస్ లోని ఓ సంస్థలో సివిల్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరింది. రోజులాగే సెప్టెంబర్ 27న మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఆమె, హిక్ లేక్ అనే కొలను దగ్గర కాళ్లు కడుక్కునేందుకు లోపలికి దిగి పొరపాటున జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రియాంక మృతదేహం వచ్చిందన్న వార్త తెలియగానే కావలిలోని చేవూరివారితోటలో ఆమె ఇంటికి బంధువులు తరలివచ్చారు.