10న పీఎస్ఎల్‌వీ-సీ32 ప్రయోగం

1468
PSLV C32 Sriharikota Shar

శ్రీహరికోట : దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ కోసం 6వ ఉపగ్రహమైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1ఎఫ్’ను ఇస్రో ఈ నెల 10న కక్ష్యలోకి పంపనుంది. ఇందుకోసం పీఎస్ఎల్‌వీ-సీ32 రాకెట్‌ ను వినియోగిస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్‌లోని వీఏబీలో ఈ రాకెట్‌ను సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. కాగా, స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఇస్రో 7 ఉపగ్రహాలు ప్రయోగించనుంది. వీటిలో ఐదింటిని ఇప్పటికే కక్ష్యలోకి చేరవేశారు. గురువారం 6వ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన అనంతరం 7వ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జీని పీఎస్ఎల్‌వీ-సీ33 రాకెట్‌ ద్వారా ఏప్రిల్‌ 28వ తేదీ ప్రయోగించనున్నారు.