రామ్ కొణిదెల..

262

రామ్ చరణ్ వినయ విధేయ రామ టీజర్ విడుదలైంది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. రెండు రోజుల తర్వాత టీజర్ తో ప్రమోషన్ ని పెంచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత. బోయపాటి మార్క్‌ మాస్‌ క్యారెక్టర్‌లో చరణ్‌ ఇరగదీశాడు. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా రెడీ చేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.