బాబాయ్ కోసం అబ్బాయ్..

44

తన మద్దతు జనసేన పార్టీకేనంటూ స్పష్టంగా సంకేతాలిచ్చారు హీరో రామ్ చరణ్. అనారోగ్యంతో ఉన్న బాబాయ్ ని పలకరించడానికి విజయవాడ వచ్చిన చరణ్, జనసేన పార్టీ ఆఫీస్ లో హల్ చల్ చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కలిశారు. జనసేన సేవాదళ్ టీషర్ట్ లో రామ్ చరణ్ ఫొటో కూడా ఈ సందర్భంగా బైటకు రావడం విశేషం. బాబాయ్ ని కలసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా ఓ మెసేజ్ పంపించారు చరణ్. ఎక్కడా జనసేన పార్టీ పేరు ప్రస్తావించకపోయినా ప్రజలకు బాబాయ్ చేస్తున్న సేవ కొనసాగాలని, ఆయన త్వరగా కోలుకోవాలని, సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు. పరోక్షంగా తన అభిమానుల్ని కూడా జనసేన పార్టీకి ఓట్లు వేసేలా సిద్ధం చేస్తున్నారు చరణ్.