కన్నేశాడు.. కొట్టేశాడు

3235

నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం పాతకోడూరులో అంగన్వాడీ టీచర్ వేముల సుగుణమ్మ పై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చేతిలో ఉన్న కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. కోడూరు పాత హరిజనవాడలో రాత్రి 9గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొలంలో పశువులు పడ్డాయి, తోలుకొని వెళ్లాలని చెప్పడంతో వేముల సుగుణమ్మ వెంకటేశ్వర్లుకి సంబంధించిన పొలంలోకి వెళ్లింది. ఇదే అదనుగా ఆమె చేయి పట్టుకుని తన కోరికను వ్యక్తం చేశాడు వెంకటేశ్వర్లు. ఆమె ప్రతిఘటించడంతో కర్రతో తలపై మోదాడు, బాధితురాలి కేకలు విని స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

11 22 33 44 55