జనసేన గురించి రేష్మి మనసులో మాట..

430

జబర్దస్త్ యాంకర్ జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్ నాయకత్వంపై స్పందించింది. క్రిస్మస్ సందర్భంగా అభిమానులతో సరదాగా ట్విట్టర్ లో చాట్ చేసిన రేష్మి రాజకీయాల్లో మనం చూడాలనుకున్న మార్పుని పవన్ తీసుకొస్తారని ఆశిస్తున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి చెప్పండి అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పింది. తన తదుపరి చిత్రాల గురించి, షోల గురించి ఎన్నో విషయాలను పంచుకుంది.

మీ ట్విటర్‌ పేరులో ‘rashmigautam27’ అని ఉంది. 27కి అర్థం ఏంటి?

రష్మి: ఏప్రిల్‌ 27న నా పుట్టినరోజు.

2019లో మీరు ఏ సినిమాల్లో నటించబోతున్నారు?

ఇంకా ఏ సినిమాకూ సంతకం చేయలేదు.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో పనిచేసే ఆలోచన ఉందా?

నా నిర్ణయం స్క్రిప్ట్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.

తారక్‌ అన్న గురించి ఒక్కమాటలో చెప్పండి?

‘ఢీ’ సీజన్‌ 10 ఫినాలేకి వచ్చి చాలా బాగా సందడి చేశారు. కంటెస్టెంట్లతో ఎంతో సరదాగా ఉన్నారు.

మీకు జబర్దస్త్‌ ఇష్టమా? ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఇష్టమా?

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌. ఎందుకంటే అందులో నేనుంటాను కాబట్టి.

పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం గురించి చెప్పండి?

మనం రాజకీయాల్లో చూడాలనుకున్న మార్పును పవన్‌ తీసుకొస్తారని ఆశిస్తున్నా.

2019లో మీ ప్లాన్స్‌ ఏంటి?

ప్రయాణించాలనుకుంటున్నాను.

మీకు నచ్చిన బాలీవుడ్‌ నటి?

మాధురీ దీక్షిత్‌.

మీ తర్వాతి చిత్రమేంటి? మేం ఆతృతగా ఎదురుచూస్తున్నాం.

నేను కూడా.

భవిష్యత్తులో వ్యాపారవేత్తగా రాణించే ఉద్దేశం ఏమైనా ఉందా?

లేదు. ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ఎంచుకుంటా.

మీ తర్వాతి చిత్రంలో హీరోగా సుడిగాలి సుధీర్‌ను చూడాలనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయమేంటి?

మంచి స్క్రిప్ట్‌ దొరికితే తప్పకుండా చేస్తాను.

అభిమానుల గురించి చెప్పండి..

నన్ను నాలా స్వీకరించారు. అదే మీలో గొప్పతనం. నాకు అండగా నిలిచారు. నిజాయతీగా మీ అభిప్రాయాలను తెలిపారు.

అగ్రహీరోలతో నటించడమే మీ కలైతే.. ఎవరితో నటిస్తారు?

నాకు పేరున్న నటులతో కలిసి నటించాలని ఉంది. అలాంటి కలలు ఏమీ లేవు.

ఇష్టమైన క్రికెటర్?

నేను క్రికెట్‌ చూడను.

తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తే జబర్దస్త్‌ను వదిలేస్తారా?

లేదు.

ఎలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు ఇవ్వాలనిపించదు?

పెళ్లి, వయసు గురించి అడిగే ప్రశ్నలు నచ్చవు.