రోడ్డు ప్రమాదంలో భార్య, భర్త మృతి. మృత్యువుతో పోరాడుతున్న కొడుకు

1941

ఉదయగిరి, సెప్టెంబర్-6: బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కడప జిల్లా మాచేపల్లికి చెందిన రవీంద్రారెడ్డి, శ్రావణి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు సురేంద్రరెడ్డి. అతని వయసు 5ఏళ్లు. వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలకోసం మాచేపల్లి నుంచి అత్తగారింటికి వచ్చింది రవీంద్రారెడ్డి కుటుంబం. ఉత్సవాల అనంతరం తిరిగి కడప వెళ్తుండగా ఉదయగిరి-నెల్లూరు ఆర్టీసీ బస్సు వారు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొంది. దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. 5ఏళ్ల బాలుడు సురేంద్రరెడ్డి తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. స్థానికుులు ఆ అబ్బాయిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.