నాయకుడంటే మీలా ఉండాలి..

106

నాయకుడంటే మీలా ఉండాలి..
మళ్లీ మీరే గెలవాలి..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ కి వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారంలో లేకపోయినా సొంత నిధులతో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తూ పేదవారికి అండగా నిలిచారంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అభినందించారు. నాయకుడంటే మీలా ఉండాలని, రూరల్ నియోజకవర్గంలో మళ్లీ మీరే గెలవాలని దీవించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం, వ్యాధుల నిర్దారణకోసం 30 మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు.
కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు స్కూల్ కు 24 గంటల్లోగా ఫ్యాన్లు, కంప్యూటర్, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.