సార్ మీరు చేసిన సాయానికి ఏడుపొస్తోంది..

121

 

ఆమంచర్లకు చెందిన కిడ్నీ బాధితుడు సుధాకర్ కి అపోలో ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయింది. ఈనేపథ్యంలో అపోలో ఆస్పత్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అనంతరం పూర్తిగా కోలుకున్న సుధాకర్.. తనకి ఇది రెండో జీవితం అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. చనిపోతాను అనుకున్న వాడిని బతికించారని, ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు కుటుంబ సభ్యుల్లా తనని చూసుకున్నారని అన్నాడు. ఆపరేషన్ కోసం నిధులు సమకూర్చిన రూరల్ ఎమ్మెల్యేకి సుధాకర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.