మంత్రి నారాయణ వల్లే పెద్దాసుపత్రికి ఈ దుస్థితి..

81

నెల్లూరు నారాయణ ఆస్పత్రి అభివృద్ధికోసమే ప్రభుత్వ ఆస్పత్రిని నిర్వీర్యం చేస్తున్నారంటూ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పెద్దాసుపత్రికి వచ్చే రోగులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వస్తున్నారని అన్నారు. మంత్రిపై ఉన్న అనుమానం తొలగిపోవాలంటే వెంటనే ఆస్పత్రి సిబ్బంది కొరత తీర్చాలని, ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని భర్తీ చేసిన రోజు తానే స్వయంగా మంత్రికి శాలువా కప్పి సత్కరిస్తానని చెప్పారు. లేకపోతే ప్రజా సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని అన్నారు.