మేఘన భవిష్యత్ కు ఎమ్మెల్యే భరోసా..

121

తండ్రి లేడు, తల్లికి చదివించే స్థోమత లేదు, ఆ అమ్మాయికేమో బీఎల్ చదవాలని ఆశ. తల్లిని ఒప్పించే ధైర్యం లేక.. ఏం చేయాలో చెప్పమంటూ ఐఏఎస్ బాలలతను సలహా అడిగింది మేఘన. ఇందుకూరుపేట అరుంధతీయవాడకు చెందిన కె.మేఘన చంద్రారెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతోంది. తన స్నేహితులతో కలసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ పరీక్షల అవగాహన సదస్సుకు హాజరైంది. బీఎల్ చదవాలని తనకున్న ఆశను వ్యక్తపరిచింది. ఆ అమ్మాయిని బీఎల్ చదివించే బాధ్యత తాను తీసుకుంటానంటూ స్పందించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. మేఘన తల్లిని ఒప్పించి తాను చదివిస్తానని మాటిచ్చారు. ఎమ్మెల్యే మాటతో మేఘన భవిష్యత్ కు ఓ భరోసా లభించింది.